పల్లవి: బుగ్గరామలింగేశ్వరా శరణు శరణు బుగ్గ నీటితో అభిషేకించెద శరణు శరణు అక్కపల్లిలో వెలసిన పరాత్పరా శరణు శరణు మా ఆశల దారి నీవే శివశంకరా…శరణు శరణు
శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి , అక్క పల్లి గ్రామం.
అక్క పల్లి గ్రామం. రాజన్న సిరిసిల్ల జిల్లా..తెలంగాణ రాష్ట్రం
బ్రహ్మమురారి సురార్చిత లింగం...నిర్మలభాసిత శోభిత లింగమ్
శివుడు శక్తిస్వరూపుడు...మోక్షదాయకుడు...భవభయ హరుడు. భవబంధాలను తెంచి జీవుడికి ముక్తినొసగే ఆ మహాలింగస్వరూపుణ్ని ధ్యానించినా, పూజించినా, దర్శించినా జన్మధన్యమే. అందుకే బ్రహ్మ, విష్ణు తదితర దేవతలు కూడా అనునిత్యం ఆ మహదేవుణ్ని స్మరిస్తూ.. అర్చిస్తూ... తరిస్తుంటారు. భక్తులు త్రికరణశుద్ధిగా త్రినేత్రుణ్ని పూజిస్తే చాలు... అతను ఇట్టే కరిగిపోయే భోళాశంకరుడు. శివుడు భక్తజన సులభుడు. చెంబెడు నీళ్ళు చిలకరించి, చిటికెడు విబూది చల్లినా... అదే తనకు అందించే గొప్ప ప్రేమగా భావించి మురిసిపోతాడు. అంతటి భక్త...వశంకరుడు... ఆ పరమేశ్వరుడు ఓ మారుమూల అడవిలో... పచ్చని ప్రకృతి ఒడిలో... నిశ్శబ్ద వాతావరణంలో... లింగ స్వరూపుడిగా... స్వయంభూమూర్తిగా... శ్రీ బుగ్గరామలింగేశ్వరుడిగా వెలిసి భక్తజన బాంధవులకు నిరంతరం శుభదర్శనమిస్తూ తరింపజేస్తున్నాడు.
శివరాత్రి ఉత్సవం
శివుడికి అంకితం చేయబడిన ప్రార్థనలు మరియు ఆచారాలను నిర్వహించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో గుమిగూడే రెండు రోజుల గొప్ప వేడుక.
మాఘ అమావాస్య
మాఘ మాసంలో పవిత్రమైన అమావాస్య రోజున భక్తులు పవిత్ర ఆచారాలు నిర్వహించి ఆశీస్సులు పొందే ప్రత్యేక కార్యక్రమం.
ఉగాది వేడుకలు
తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని, ఆలయంలో ఉగాదిని సాంప్రదాయ ప్రార్థనలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలతో జరుపుకుంటారు.(రాగం: శివరంజని లేదా బిలహరి – సంగీతంతో స్వేచ్ఛగా మార్చవచ్చు)
పల్లవి: బుగ్గరామలింగేశ్వరా శరణు శరణు బుగ్గ నీటితో అభిషేకించెద శరణు శరణు అక్కపల్లిలో వెలసిన పరాత్పరా శరణు శరణు మా ఆశల దారి నీవే శివశంకరా…శరణు శరణు
చరణం 1: రహస్య గంగా నీవే… జలజాలమై పారేవే లింగరూపాన వెలిసి… పాతాళ గంగతో నిలిచావే కారడవిలోనీ కాంతులే… నీ దర్శనం ఏకాంతమే పశ్చిమదిశలో వెలిసిన భక్తవత్సల శరణు శరణు
చరణం 2: శివరాత్రి శోభలో వెలిగేవు… మాఘ అమవసిలో నిలిచేవు పాలాభిషేక పూజలతో… తరియింతురే భక్తజనాలే కొండల మధ్య నవెలసిన జంగమదేవరా నీ దర్శనమే ముక్తిపథం… నీ స్పర్శే పాపనాశనం
చరణం 3: బూది చల్లిన చిటికెడు… నీ హృదయాన్నే తాకునే చెంబు నీళ్లతో సేవకే… పొంగిపోదువే భోళాశంకర కోటిజన్మల పుణ్యమిచ్చే, స్వయం భూమూర్తి నీవే శంభో శంకరా! కాపాడగ రారా...కదలి రారా
పల్లవి : శ్రీ బుగ్గరామలింగేశ్వరా శరణం బుగ్గ నీటితో అభిషేకించెద శరణు శరణు అక్కపల్లిలో వెలసిన పరాత్పర శరణు శరణు మా ఆశల దారి నీవే శివశంకరా…శరణు శరణు
మన పవిత్ర వేడుకలో భాగం అవ్వండి
1. బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం । జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం ॥
2. దేవమునిప్రవరార్చిత లింగం కామదహం కరణోనాశ లింగం । క్రుపామయతరాక్షిత లింగం
3. సర్వసుగంధ సులేపిత లింగం బుద్ధివివర్ధన కారణ లింగం । సిద్ధసురాసురవందిత లింగం తత్ప్రణమామి సదాశివ లింగం ॥
4. కనకమహామణి భూషిత లింగం ఫణిపతిహర్షణీయ లింగం । పార్వతీశ శివశంభు లింగం తత్ప్రణమామి సదాశివ లింగం ॥
5. పంచమహాభూత యౌకృత లింగం నిత్యమద్వైత నిర్మల లింగం । ఫణిద్రధరసన శోభిత లింగం తత్ప్రణమామి సదాశివ లింగం ॥
6. దేవగణార్చిత సేవిత లింగం భావయ భావారహిత లింగం । దినకర చంద్రవిలోచన లింగం తత్ప్రణమామి సదాశివ లింగం ॥
7. అష్టదలోపరివేష్టిత లింగం సర్వసముద్భవ కారణ లింగం । అష్టదరిద్ర వినాశిత లింగం తత్ప్రణమామి సదాశివ లింగం ॥
8. సురగురు సురవర పూజిత లింగం సురవనపుష్ప సదార్చిత లింగం । పరాత్పరెణ సదాశివ లింగం తత్ప్రణమామి సదాశివ లింగం ॥ ఫలశ్రుతి: లింగాష్టకం యః పఠతిః పుణ్యదేహీ శివసానం వుపేత్య పునర్జన్మ నేతి ॥